బావయ్యో ఒక్కసారి సూచిపోవా
బావాయ్యో నీ తోడుగుంట తోల్కపోవ
బావయ్యో ఒక్కసారి సూచిపోవ
బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవ
నువు ఇల్లిడిచి పాయనుండి
ఇల్లు వాకిలయనాది
పటెలోనికి పోలిసోనికి
పట్ట పగ్గల్ లేకపాయె
గుండగాల్లు రండగాల్లూ
గండు మిండ్లై కూర్చున్నారు
ఎల్లమ్మ పుల్లమ్మలు
ఎత్తి పొడుపు మాటలండ్రు
బావయ్యో నా గుండెనిండ గాయాలే
బావయ్యో నా గుండెకద్దుకుంట రావా
బావయ్యో... బావయ్యో
ఒక్కసారి సూచిపోవా
బావయ్యో నీతోడుగుంట తోల్కపోవ
అతడు
ఎట్ల బతుకుడు ఎలా బతుకుడు
తెలంగాణ జిల్లాలోనా
కోరస్
ఎట్ల బతుకుడు ఎలా బతుకుడు
తెలంగాణ జిల్లాలోనా
అతడు
లాఠీ తూటాల రాజ్యమాయే
తెలంగాణ పల్లెలోనా
కోరస్
లాఠీ తూటాల రాజ్యామాయే
తెలంగాణ పల్లెల్లోన
అతడు
మీసం మొలిసిన కొడుకులజూసి
ఆశలెన్నో పెంచుకొంటే
కోరస్
ఆశలెన్నో పెంచుకొంటే
చదువుకొని గొప్పోలయి
అతడు
సాక్తారని కలలుగంటే
కోరస్
సాక్తారని కలలుగంటే
అతడు
కన్నందుకు కంటిపాపల
కాటికయ్యన మోయకుండ
కోరస్
కాటికయ్యన మోయకుండ
అతడు
గుండేకోత మిగిలిపాయే
తెలంగాణ జిల్లాలోనా
కోరస్
గుండేకోత మిగిలిపాయే
తెలంగాణ జిల్లాలోనా
అతడు
అయ్యా అవ్వకు ఆశేలేదు
తెలంగాణ పల్లెలోన
కోరస్
అయ్యా అవ్వకు ఆశేలేదు
తెలంగాణ పల్లెల్లోన
ఆమె
బావయ్యో...
బావయ్యో ఒక్కసారి సూచిపోవ
బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవ
చిన్నోని సూపులల్లో
నీ రూపం జూసుకోని
చంటిదాని నడకలల్లో
నీ నడకలు జూసుకోని
మొకంమీద కొంగుబెట్టి
గొల్లున నేనెడిస్తే
మొకంలోన మొకంబెట్టి
అమ్మా ఎందుకేడ్తవనిరి
బావయ్యో చంటిపిల్లల సూచిపోవ
బావయ్యో కంటనీరు తుడిచిపోవా
బావయ్యో... బావయ్యో
ఒక్కసారి సూచిపోవ
బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా
ఆఆఆఆ
ఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆ
అతడు
ఎట్ల బతుకుడు ఎలా బతుకుడు
తెలంగాణ జిల్లాలోన
కోరస్
ఎట్ల బతుకుడు ఎలా బతుకుడు
తెలంగాణ జిల్లాలోన
అతడు
లాఠీ తూటాల రాజ్యమాయె
తెలంగాణ పల్లెలోన
కోరస్
లాఠీ తూటాల రాజ్యమాయె
తెలంగాణ పల్లెల్లోన
అతడు
తుపాకుల మోతలతోటి
తూరుపు తెల్లారబట్టే
కోరస్
తూరుపు తెల్లారబట్టే
అతడు
గుట్టాపక్కన శవంజూసి
గుర్తుపట్టుట కష్టమాయె
కోరస్
గుర్తుపట్టుట కష్టమాయె
అతడు
కుల్లిపోయిన బిడ్డల ఒళ్లును
గండు చీమలు తినుడుజూసి
కోరస్
గండు చీమలు తినుడు జూసి
అతడు
కాలు మీద పుట్టుమచ్చలు
తెలంగాణ జిల్లాలోన
కోరస్
కాలు మీది పుట్టుమచ్చలు
తెలంగాణ జిల్లాలోన
అతడు
కన్నాకొడుకుల రూపులు తెలిపే
తెలంగాణ పల్లెలోన
కోరస్
కన్నాకొడుకుల రూపులు తెలిపే
తెలంగాణ పల్లెల్లోన
ఆమె
బావయ్యో... బావయ్యో
ఒక్కసారి సూచిపోవ
బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా
పిల్లలమీద ప్రాణంగుంజి
నన్ను చూడ మనసు గుంజి
నీ తల్లి తమ్మిని చూడ
ఊరికొచ్చి పోతావేమో
వచ్చేటప్పుడు పోయేటప్పుడు
పోలిసోని కండ్ల పడితే
పట్ట పగలు నిన్ను కాల్చి
పసుపుతాడు తెంపుతరేమో
బావయ్యో నువు రాకుంటే మానేగాని
బావయ్యో నువు పోరుబాట వదలబోకు
బావయ్యో ఎట్లగట్ల బతకుతాము
బావయ్యో నువు చింత చెంది చెదరిపోకు
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

0 కామెంట్‌లు